నవ్వు నాల్గు విధాల చేటు అని విన్నాం.
నవ్వితే పోయెదేమి లెదు (నవ్వు తప్ప) అనీ విన్నాం.
కానీ నవ్వితే గాయపడటం ఏమిటా అని ఆలోచిస్తున్నారా?
అలాంటి ఒక సంఘటన నాకు ఈ రోజు అనుభవం లోకి వచ్చింది...అదేమిటో ఇప్పుడు చూద్దాం.
మా డెన్వర్ లో ఆరు నెలల తరువాత భాను ప్రసాద్ (సూర్య భగవానుడు) మళ్ళీ అధికారంలోకి వస్తున్నాడు కదా అని,
ఇప్పుడే దేశం దాటి పోయే పని ఏమి లేదని,గజిని స్తైల్ అని కొత్త ఫ్యాషన్ వచ్చింది కదా అని...
అందులోనూ "ఊరుకున్నంత ఉత్తమం లేదు...బోడి గుండంత సుఖం లేదు" అన్న సామెతను పాటిస్తూ,
"కాస్ట్ కట్టర్స్" అనే ఒక మంగళి కొట్టుకి వెళ్ళాను.
అక్కడి క్షవర కన్యతో...(కట్టింగ్ చేసేది అమ్మాయి మరి!!!)....ROUND HEAD 2 అని చెప్పా.
నన్ను అద్దం వైపు కాకుండా రెండో వైపుకి తిప్పి కూర్చొబెట్టి...గీకటం మొదలు పెట్టింది(మరి 2 అంటే నున్నగా గొరిగే దానికి కొంచెం concession ఇచ్చి, ఏదో వున్నది అనిపించుకునేటట్టు వుంచుకోటమే కదా).
సగం గీకాక...నన్ను అద్దం వైపు తిప్పి ఇంకో పక్క చెయ్యటం మొదలుపెట్టింది.
అప్పుడు అద్దంలో నా ముఖారవిందాన్ని చూసుకుని (ఈ face ఎక్కడో చూసి నట్టుందే) అని అనుకుని...ఆ పై "గుండు బాస్" నెనే అని గుర్తుకు వచ్చి...నాకు ఒక పట్టాన నవ్వు అగలా.
యెప్పుడో చిన్నఫ్ఫుడు మా నాన్న మంగలాడి దగ్గరికి తీసుకెళ్ళి ఇలా డిప్ప కట్టింగ్ వేయించేవారు.
Of course..అదే ఇప్పుడొక ఫ్యాషన్ అయ్యిందనుకోండి!!!
నేను నవ్వుతూనే వున్నా...ఆ భామ గీకుతూనే వుంది.
కాసేపటికి...ఈ అమ్రుత వాక్కులు ఆమె నోటి నుంచి జాలువారాయి. "stop laughing..otherwise, you will hurt yourself."
(నవ్వాపు..లెదంటే గాయపడతావ్)
సో...అలా ఈ నవ్వు యొక్క కొత్త కోణం నాకు అనుభవంలోకి వచ్చింది.
నేను హైదరాబద్ లొ వున్నప్పుడు ఓంకార మూవీ చూసా. అందులో సైఫ్ అలి ఖన్ Hair స్టైల్ (డిప్ప కట్టింగ్) నాకు మా బాగ నచ్చేసింది.
అలా నేను కూడా కొట్టించుకుందాం అని అప్పుడు మనసులో ఒక కోరిక కలిగినా...హైదరాబద్ లొ కుక్కలు అన్నీ నా వెనకే పడతాయి అనీ...మరియు...ఇంటికి వెళితే..ఇంట్లొ వాళ్ళు తిట్టే బూతులు తట్టుకునే శక్తి లేక..ఆ చిలిపి కోరికని నా మనసులొ ఒక మూలకి తోసి (వజ్రోత్సవాలలో చిరంజీవి గనక అవార్డు ని పెట్టెలో పెట్టి తాళం వేసినట్టు) నా మనసులో ఆ పార్ట్ కి గట్టి తాళం వేసా
చిరంజీవి ఏదో పాతికేళ్ళ తరువాత తీద్దాం అన్నాడు. నేను కూడా అలా అనుకునుంటే కొట్టిచ్చుకోకుండానే నాది బోడి గుండు అయ్యేది...నా కోరిక నాలోనే సమాధి అయిపోయేది.
అమెరికా వచ్చినందుకు అలా అంత నిరీక్షించాల్సిన అవసరం లేకుండానే అది ఈ విధంగా సాకారం అయ్యి నందుకు ఆనందంగా వుంది.
ముఖ్యంగా ఈ టపా రాయటానికి కారణం...రేపు ఆఫీస్ లో విహారి గారిని కలిసి నప్పుడు షాక్ ఇవ్వటం ఇష్టం లేక (ఆ షాక్ కి గురై..ఆయన తన తరహా మానేసి ఎమన్న పిచ్చి పిచ్చిగా రాయటం మొదలుపెడతారేమో అని)...ఈ ప్రమాద ఘంటిక మోగించడమైనది.
Monday, March 31, 2008
Subscribe to:
Posts (Atom)